టీమిండియాతో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో ప్రధాన ఆటగాడు దూరం..

|

Dec 03, 2020 | 4:04 PM

టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు గాయమైంది.

టీమిండియాతో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో ప్రధాన ఆటగాడు దూరం..
Follow us on

India Vs Australia 2020: టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు గాయమైంది. దీనితో అతడు టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఇప్పటికే డేవిడ్ వార్నర్, ప్యాట్ కమిన్స్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మిచెల్ స్టార్క్‌కు కూడా గాయం కావడంతో కంగారూ జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.

కాగా, గాయం కారణంతోనే స్టార్క్‌ మూడో వన్డేకు దూరమయ్యాడట. అతడికి మరికొన్ని రోజుల విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించడంతో భారత్‌తో మూడు టీ20లు ఆడే అవకాశం లేదని కనిపిస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి టీ20 జరగనుంది. చివరి వన్డే గెలిచిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఆసీస్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. మరి ఏ జట్టు విజయంతో సిరీస్‌ను ఆరంభిస్తుందో వేచి చూడాలి.