బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా సిద్దం.. జట్టు కూర్పుపై రహనేకు గంభీర్ సలహాలు..

|

Dec 23, 2020 | 2:15 PM

అడిలైడ్ వైఫల్యాన్ని మర్చిపోయే రీతిలో బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించేందుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా సిద్దం.. జట్టు కూర్పుపై రహనేకు గంభీర్ సలహాలు..
Follow us on

India Vs Australia 2020: అడిలైడ్ వైఫల్యాన్ని మర్చిపోయే రీతిలో బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించేందుకు టీమిండియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకున్న భారత్.. రెండో టెస్టు కోసం ప్రాక్టీస్ సెషన్లను షూరూ చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు గాయం కారణంగా పేసర్ మహమ్మద్ షమీ స్వదేశానికి తిరుగు వచ్చేయడం.. అలాగే బ్యాటింగ్ విభాగం వైఫల్యంతో టీమిండియా జట్టు కూర్పుపై సమాలోచనలు చేస్తోంది. రెండో టెస్టులో భారీ మార్పులు చేసేందుకు సిద్దమైంది. ఈ తరుణంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ అజింక్య రహనేకు పలు సూచనలు ఇచ్చాడు.

శుభ్‌మాన్ గిల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా, పుజారా మూడో స్థానంలో, రహనే 4, కేఎల్ రాహుల్ 5, పంత్ 6, రవీంద్ర జడేజా 7, అశ్విన్ 8వ స్థానంలో ఆడాలని తెలిపాడు. అలాగే ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని.. అందులో ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు ఉండాలని సూచించాడు. అశ్విన్‌కు తోడుగా స్పిన్ విభాగంలో జడేజా ఉంటే జట్టుకు మరింత బలాన్ని చేకూరిస్తుందని కెప్టెన్ రహనేకు గంభీర్ సలహాలు ఇచ్చాడు.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!