కోవిడ్ ఎఫెక్ట్ నుంచి పేదలకు రక్షణ, ప్రపంచ బ్యాంకుతో భారత్ భారీ ఒప్పందం, ఇక ‘ఆరోగ్య భారతం’

| Edited By: Pardhasaradhi Peri

Dec 17, 2020 | 3:32 PM

కోవిడ్ ఎఫెక్ట్ నంచి పేదలను కాపాడేందుకు, వారికి సాయపడేందుకు ఇండియా ప్రపంచ బ్యాంకుతో 400  మిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా వరల్డ్ బ్యాంకుతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఇది రెండో సారి. లోగడ మే నెలలో

కోవిడ్ ఎఫెక్ట్ నుంచి పేదలకు రక్షణ, ప్రపంచ బ్యాంకుతో భారత్ భారీ ఒప్పందం, ఇక ఆరోగ్య భారతం
Follow us on

కోవిడ్ ఎఫెక్ట్ నంచి పేదలను కాపాడేందుకు, వారికి సాయపడేందుకు ఇండియా ప్రపంచ బ్యాంకుతో 400  మిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా వరల్డ్ బ్యాంకుతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఇది రెండో సారి. లోగడ మే నెలలో 750 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ద్వారా ప్రపంచ బ్యాంకు ఈ నిధులను అందజేయనుంది. తాజా అగ్రిమెంట్ పై బుధవారం భారత ప్రభుత్వం తరఫున ఎకనమిక్  అఫైర్స్ డిపార్ట్ మెంట్   అడిషనల్ సెక్రటరీ డా.సీ.ఎస్. మహాపాత్ర, వరల్డ్ బ్యాంక్ తరఫున తాత్కాలిక కంట్రీ డైరెక్టర్ సుమిలా గుల్యానీ సంతకాలు చేశారు.

దేశంలో కోవిడ్ 19 కల్పించిన కష్టాలు, ఆరోగ్య సంబంధ రుగ్మతల నుంచి పేదలు, బలహీనవర్గాలను రక్షించి వారికి సామాజిక సాయం అందజేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంతో బాటు రాష్ట్ర ప్రభుత్వాల కేపబిలిటీ (సామర్థ్యం) కూడా పెరుగుతుందని ఈ వర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా అర్బన్-పెరి-అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలే కాకుండా వలస కార్మికులకు కూడా ఈ సాయ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నాయి.

ప్రపంచ బ్యాంకు అందించిన తొలి విడత సాయం..అంతకుముందు ప్రభుత్వం చేబట్టిన కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, తాజా అగ్రిమెంట్  ప్రస్తుత, భవిష్యత్ పథకాలకు తోడ్పడుతుందని ఆర్ధిక శాఖ తెలిపింది. ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ, ముఖ్యంగా హాట్ స్పాట్ జిల్లాలకు ఈ సాయం వరంగా  మారనుందని ఈ మంత్రిత్వ శాఖ వివరించింది.