పోటెత్తనున్న జనం.. చైనాను మించనున్న ఇండియా

| Edited By:

Jun 18, 2019 | 12:03 PM

మరో ఎనిమిదేళ్లలో జనాభాలో చైనాకు భారత్‌కు చెక్ పెట్టనుంది. 2027లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ మారనుందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా 2050 నాటికి భారత్‌లో జనాభా 273మిలియన్లకు చేరుకుంటుందని.. ఈ శతాబ్దం మొత్తానికి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉండబోతుందని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారత జనాభా 1.37 మిలియన్లు కాగా.. చైనా జనాభా 1.43 మిలియన్లని ఈ నివేదిక తెలిపింది. ఐక్యరాజ్య సమితిలోని […]

పోటెత్తనున్న జనం.. చైనాను మించనున్న ఇండియా
Population
Follow us on

మరో ఎనిమిదేళ్లలో జనాభాలో చైనాకు భారత్‌కు చెక్ పెట్టనుంది. 2027లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ మారనుందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా 2050 నాటికి భారత్‌లో జనాభా 273మిలియన్లకు చేరుకుంటుందని.. ఈ శతాబ్దం మొత్తానికి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉండబోతుందని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారత జనాభా 1.37 మిలియన్లు కాగా.. చైనా జనాభా 1.43 మిలియన్లని ఈ నివేదిక తెలిపింది.

ఐక్యరాజ్య సమితిలోని ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన ‘ప్రపంచ జనాభా అంచనాలు-2019’ అనే నివేదికలో ప్రస్తుత ప్రపంచ జనాభా 7.7బిలియన్లు ఉండగా.. 2050 నాటికి 9.7బిలియన్లు పెరగనుందని తెలిపింది. 2050 వరకు పెరగనున్న జనాభాలో.. కేవలం 9 దేశాల్లోనే సగానికిపైగా పెరుగుదల ఉంటుందని నివేదిక వెల్లడించింది. అందులో భారత్, నైజీరియా, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్ట్, అమెరికా దేశాలు ఉన్నాయి. ఇక మనుషుల సగటు జీవిత కాలం కూడా పెరుగుతోందని ఐరాస నివేదిక తెలిపింది. 1990లో సగటు జీవిత కాలం 64.2 ఏళ్లు ఉండగా.. 2019లో 72.6కు చేరిందని.. 2050 నాటికి ఇది 77.1ఏళ్లుగా ఉంటుందని వెల్లడించింది.