Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్

Fastest in world: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సినేష‌న్ల‌ సంఖ్య 32 కోట్లు దాటింది.

Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్
Vaccination
Follow us

|

Updated on: Jun 28, 2021 | 11:33 AM

కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. దేశంలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సినేష‌న్ల‌ సంఖ్య 32 కోట్లు దాటింది. ఆదివారం దేశంలో 17, 21 268 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 మందికి టీకాలు ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఫ‌లితంగా ప్రపంచంలోనే  అత్య‌ధిక వేగంగా వ్యాక్సినేషన్ చేసిన దేశంగా భారత్ అవతరించింది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ అందించిన నివేదిక ప్రకారం బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, భారత్‌ల‌లో వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతోందని వెల్లడైంది.

ఇక్క‌డ‌ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… భారత్‌లో వ్యాక్సిన్ వేసే కార్యక్ర‌మం ఈ ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభం కాగా, బ్రిటన్‌లో గ‌త ఏడాది డిసెంబర్ 8 న, యూఎస్‌లో డిసెంబర్ 14 న, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ల‌లో డిసెంబర్ 27 న మొద‌ల‌య్యింది. జూన్ 28న ఉదయం 8 గంటల స‌మ‌యానికి బ్రిటన్‌లో 7 కోట్ల, 67 లక్షల 74 వేల 990, అమెరికాలో 32 కోట్ల, 33 లక్షల, 27 వేల 328, ఇట‌లీలో 4 కోట్లు 96 లక్షల 50 వేల 721, జర్మనీలో  7 కోట్ల 14 లక్షల‌ 37 వేల 514, ఫ్రాన్స్‌లో 5 కోట్ల 24 లక్షల 57 వేల 288 మందికి టీకాలు వేశారు.

India Tops Global Vaccinati

India Tops Global Vaccinati

ఇదే స‌మ‌యంలో భారతదేశంలో ఈ సంఖ్య 32 కోట్ల, 36 లక్షల 63 వేల 297గా ఉంది. భారతదేశంలో జూన్ 27 న 13.9 లక్షల మందికి టీకా మొదటి డోసు, 3.3 లక్షల మందికి టీకా రెండవ డోసు ఇచ్చారు. ఏప్రిల్ ఒక‌టి నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడం ప్రారంభించారు. మే ఒక‌టి నుంచి 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి: తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..

T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు

Latest Articles
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!
హైదరాబాద్‌లో కుండపోత వాన.. నగరమంతా ట్రాఫిక్‌ జామ్‌!