దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 63,509 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. మరో 730 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. 71,760 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసులు 72,39,390కు చేరుకున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,26,877 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 1,10,586కి చేరింది. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 63,01,928కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు కూడా భారీగా పెరగడం కాస్త ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 86.36 శాతం ఉండగా..డెత్ రేటు 1.3 శాతంగా ఉంది. ప్రతి మిలియన్ మందికి గాను అత్యంత తక్కువ కరోనా కేసులు, మరణాలు భారత్‌లో నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
Also Read :
Breaking : కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య !
హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్: 3 రోజులు బయటకు రావొద్దు