కొత్తరకం కరోనా వైరస్ కలవరం.. కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 31 వరకు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం..

బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది.

కొత్తరకం కరోనా వైరస్ కలవరం.. కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 31 వరకు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం..

Updated on: Dec 21, 2020 | 5:10 PM

India Bans UK Flights: బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు దాకా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ స్పష్టం చేసింది. అలాగే బ్రిటన్ మీదుగా భారత్ వచ్చే ప్రయాణీకులపై పలు ఆంక్షలు విధించింది. వారంతా కూడా భారత్ వచ్చాక ఖచ్చితంగా RT-PCR టెస్ట్ చేయించుకోవాలని కేంద్రం వెల్లడించింది. కాగా, ఇప్పటికే బ్రిటన్ విమానాలపై ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా వంటి దేశాలని నిషేధం విధించిన సంగతి తెలిసిందే.