రేపు అమరావతిలో మహాప్రదర్శన.. ఉద్యమం మరింత ఉధృతం..: జేఏసీ

ఏపీ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ సందర్బంగా అమరావతి జేఏసీ నేతలు మాట్లాడుతూ.. బుధవారం రాజధాని గ్రామాలను రైతులు, రైతు కూలీలు, మహిళలు చుట్టి రానున్నారని, రేపు రాజధాని గ్రామాల్లో దీక్ష శిబిరాలు ఉండవని ప్రకటించారు. మహా ప్రదర్శన కోసం ట్రాక్టర్లు, బైకులు ఇతర సాధనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. రేపు జరుగనున్న మహాప్రదర్శనలో అమరావతి 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొననున్నారని […]

రేపు అమరావతిలో మహాప్రదర్శన.. ఉద్యమం మరింత ఉధృతం..: జేఏసీ

Edited By:

Updated on: Jan 28, 2020 | 6:07 PM

ఏపీ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ సందర్బంగా అమరావతి జేఏసీ నేతలు మాట్లాడుతూ.. బుధవారం రాజధాని గ్రామాలను రైతులు, రైతు కూలీలు, మహిళలు చుట్టి రానున్నారని, రేపు రాజధాని గ్రామాల్లో దీక్ష శిబిరాలు ఉండవని ప్రకటించారు. మహా ప్రదర్శన కోసం ట్రాక్టర్లు, బైకులు ఇతర సాధనాలు వినియోగించనున్నట్లు తెలిపారు.

రేపు జరుగనున్న మహాప్రదర్శనలో అమరావతి 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొననున్నారని జేఏసీ నేతలు తెలిపారు. మహాప్రదర్శనలో ఐదేళ్ల బాలుడి నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు పాల్గొంటున్నారని, బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాప్రదర్శన జరుగుతుందన్నారు. మహాప్రదర్శన ద్వారా రాజధాని గ్రామాల్లో ఉద్యమానికి కొత్త ఊపు వస్తుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.