‘నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్’‌ స్కీమ్‌లో కీలక మార్పులు: కేంద్రం

| Edited By:

Aug 14, 2020 | 4:31 PM

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం 'నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌' పథకానికి వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని రూ .6 లక్షల నుంచి రూ .8 లక్షలకు పెంచినట్లు సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లో కీలక మార్పులు: కేంద్రం
Follow us on

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం ‘నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌’ పథకానికి వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచినట్లు సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 2020-21 నుంచి ఇది అమల్లోకి రానున్నది. అంతర్జాతీయంగా ఉత్తమ ర్యాంకులున్న విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. కనీస అర్హత మార్కులను 55 శాతం నుంచి 60 శాతానికి పెంచారు.

వివిధ ధృవీకరణ ప్రక్రియలు సరళీకృతం చేయబడ్డాయి. పోలీసు ధృవీకరణ తొలగించి, స్వీయ-ప్రకటనను తీసుకొచ్చారు. ఈ మార్పుల వల్ల ఎంపిక ప్రక్రియ మరింత సులభంగా మారింది. గతేడాదితో పోలిస్తే, ఈ ఏడాది అన్ని స్లాట్లు తక్కువ సమయంలోనే నిండే అవకాశం ఉంది. ఈ ఎంపిక ఏడాది తొలి త్రైమాసికంలో దరఖాస్తుల స్వీకరణ ఆధారంగా, 100 స్లాట్లకు గాను 42 స్లాట్లు ఇప్పటికే నిండిపోయాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!