పేపర్‌ కప్పులో టీ, కాఫీ తాగడం కూడా ప్రమాదకరమే !

|

Nov 09, 2020 | 8:41 PM

ఇప్పటి వరకు ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే ప్రమాదకరమని అనుకున్నాం. అందుకు బదులుగా ఒకసారి యూజ్ చేసి పారేసే పేపర్‌ (డిస్పోజబుల్‌) కప్పులు వినియోగానికి అలవాటుపడ్డాం.

పేపర్‌ కప్పులో టీ, కాఫీ తాగడం కూడా ప్రమాదకరమే !
Follow us on

ఇప్పటి వరకు ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే ప్రమాదకరమని అనుకున్నాం. అందుకు బదులుగా ఒకసారి యూజ్ చేసి పారేసే పేపర్‌ (డిస్పోజబుల్‌) కప్పులు వినియోగానికి అలవాటుపడ్డాం. కానీ ఖరగ్‌పుర్‌ ఐఐటీ సంచలన విషయం చెప్పింది. పేపర్‌ కప్పుల్లో టీ, కాఫీ తాగినా డేంజరే అని తమ అధ్యయనంలో తేలినట్టు చెప్పింది.  ”పేపర్‌ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్‌లోని మైక్రోప్లాస్టిక్‌ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో మిళితమవుతాయి.  పేపర్‌ కప్పులు హైడ్రోఫోబిక్‌ ఫిల్మ్‌ సన్నటి పొరతో తయారుచేస్తారు. ఇందులోనూ పాలీ ఇథలీన్‌(ప్లాస్టిక్‌) ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్‌ లేయర్‌లో చర్య జరుగుతుంది’ అని ఈ అధ్యయనానికి లీడ్‌గా వ్యవహరించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుధా గోయెల్‌ పేర్కొన్నారు. 85-90 డిగ్రీల సెల్సియస్‌ వేడి ఉండే 100 ఎంఎల్‌ వేడి ద్రవంలోకి పేపర్‌ కప్పు ద్వారా 25 వేల మైక్రోప్లాస్టిక్‌ రేణువులు రిలీజవుతాయి. ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు.

 

Also Read :

వయోవృద్ధులు, చిన్నారులకు అప్పుడే శ్రీవారి దర్శనం

సామాన్యులకు చిక్కనంటోన్న ఉల్లి