బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

|

Sep 10, 2020 | 2:21 PM

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.? తరచూ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా.? అయితే ఖచ్చితంగా ఈ విషయం గురించి మీరు తెలుసుకోవాలి.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..
Follow us on

ICICI Bank New Rule: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.? తరచూ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా.? అయితే ఖచ్చితంగా ఈ విషయం గురించి మీరు తెలుసుకోవాలి.! ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు తమ ఖాతాదారుల నుంచి కొత్త ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమైంది. ఈ సరికొత్త నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి రానుంది.

డిజిటల్ లావాదేవీలను పెంచాలనే ఉద్దేశ్యంతో ఐసీఐసీఐ ఈ కొత్త రూల్ అమలులోకి తీసుకొస్తోంది. రుణ గ్రహీతలు ఇకపై బ్యాంక్‌కు వచ్చి లోన్ ఈఎంఐ కడితే క్యాష్ ట్రాన్సాక్షన్ చార్జీ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. రూ. 100 అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఖాతాదారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరపాలని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఇందుకోసం ఖాతాదారులకు పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అందుబాటులో ఉంచింది.

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

విజయవాడ మీదుగా 24 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..!