అసెంబ్లీలో రైతుల సమస్యలను పరిష్కరించకపోతే..!

| Edited By: Srinu

Dec 10, 2019 | 12:54 PM

మండపేటలో జనసేన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. రక్తమాంసాలు ధారపోసి పండించే రైతుల పంటలకు రసీదు ఇవ్వడంలేదని జగన్ పై మండిపడ్డారు. వేలకోట్ల ఆస్తులు, సొంత ఇళ్ళు ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వ నిధులకోసం ఆశపడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇవ్వండని, రైతులను బ్రతికించండని పవన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని పవన్ గుర్తుచేశారు. రైతుల పంటలకు గిట్టుబాట ధర […]

అసెంబ్లీలో రైతుల సమస్యలను పరిష్కరించకపోతే..!
Follow us on

మండపేటలో జనసేన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. రక్తమాంసాలు ధారపోసి పండించే రైతుల పంటలకు రసీదు ఇవ్వడంలేదని జగన్ పై మండిపడ్డారు. వేలకోట్ల ఆస్తులు, సొంత ఇళ్ళు ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వ నిధులకోసం ఆశపడుతున్నారని దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇవ్వండని, రైతులను బ్రతికించండని పవన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని పవన్ గుర్తుచేశారు. రైతుల పంటలకు గిట్టుబాట ధర అయినా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని పనవ్ తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై మాట్లాడి తీరాలని గుర్తుచేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడినవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పవన్ తెలిపారు. అసెంబ్లీ మొదటి మూడు రోజుల్లో రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే, కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్షకు వెళ్తామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.