మా నాన్నను.. చివరి సారిగా చూడాలని ఉంది.. పోలీసుల రక్షణ కోరిన అమృత

| Edited By:

Mar 09, 2020 | 11:51 AM

తన తండ్రిని చివరిసారిగా చూడాలనుకుంటున్నానని, అందుకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది అమృత. ఈ మేరకు అధికారులకు సమాచారం పంపించింది అమృత. అక్కడికి వెళ్తే తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని..

మా నాన్నను.. చివరి సారిగా చూడాలని ఉంది.. పోలీసుల రక్షణ కోరిన అమృత
Follow us on

తన తండ్రిని చివరిసారిగా చూడాలనుకుంటున్నానని, అందుకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది అమృత. ఈ మేరకు అధికారులకు సమాచారం పంపించింది అమృత. అక్కడికి వెళ్తే తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మారుతీరావు భౌతిక కాయాన్ని అమృత సందర్శించాలనుకుంటున్న విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలియజేస్తామన్నారు. వారి అభిప్రాయం తెలుసుకున్న తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

కాగా.. నిన్న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సూసైడ్ లెటర్ రాసి.. విషం తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. 2018లో కిరాయి హంతకులతో కూతురు భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించారు మారుతీరావు.

అయితే.. తన తండ్రి అంత్యక్రియలకు అమృత వస్తానని చేసిన విజ్ఞప్తిపై ఆమె తల్లి స్పందించలేదని తెలుస్తోంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న ఆగ్రహంతో ఆమె ఉన్నట్లు కుటుంబ బంధువులు కొందరు తెలిపారు. అలాగే.. అమృత బాబాయ్, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కూడా నిరాకరించాడని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..