జేడీఎస్ నేతలే టార్గెట్‌గా.. ఐటీ రైడ్స్

| Edited By:

Apr 16, 2019 | 5:00 PM

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్ నేతలే టార్గెట్‌గా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. బెంగళూరు, హసన్‌, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రియల్‌ఎస్టేట్‌, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించేవారు, కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వీరి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయని, వాటికి పన్ను చెల్లించట్లేదని […]

జేడీఎస్ నేతలే టార్గెట్‌గా.. ఐటీ రైడ్స్
Follow us on

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్ నేతలే టార్గెట్‌గా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. బెంగళూరు, హసన్‌, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రియల్‌ఎస్టేట్‌, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించేవారు, కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వీరి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయని, వాటికి పన్ను చెల్లించట్లేదని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుపుతున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.

కాగా కర్ణాటకలో ఏప్రిల్‌ 18న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కూడా రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జేడీఎస్‌ నేతల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. వీటి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.