శాంతి.. శాంతి.. విద్యార్థులకు ప్రధాని మోదీ హితవు

|

Dec 17, 2019 | 7:10 PM

పౌరసత్వ సవరణ చట్టంపై యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థులు ప్రజాస్వామ్యబధ్ధంగా, ప్రశాంతంగా నిరసనలు తెలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘ మీ అభిప్రాయాలు, ఐడియాలు ఉంటే వాటిని ప్రభుత్వానికి తెలపాలని, తద్వారా చర్చలకు మార్గం సుగమమవుతుందని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం మన పవిత్ర ‘ పుస్తకమని ‘, మన విధానాలపై డిబేట్ లేదా చర్చ జరపడం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. మంగళవారం ఝార్ఖండ్ లోని బరాహట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులు […]

శాంతి.. శాంతి.. విద్యార్థులకు ప్రధాని మోదీ హితవు
Follow us on

పౌరసత్వ సవరణ చట్టంపై యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థులు ప్రజాస్వామ్యబధ్ధంగా, ప్రశాంతంగా నిరసనలు తెలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘ మీ అభిప్రాయాలు, ఐడియాలు ఉంటే వాటిని ప్రభుత్వానికి తెలపాలని, తద్వారా చర్చలకు మార్గం సుగమమవుతుందని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం మన పవిత్ర ‘ పుస్తకమని ‘, మన విధానాలపై డిబేట్ లేదా చర్చ జరపడం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. మంగళవారం ఝార్ఖండ్ లోని బరాహట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులు చెప్పేది తాము వింటామని, అయితే కొన్ని రాజకీయ పార్టీలు, పట్టణ ప్రాంత నక్సల్స్ మిమ్మల్ని (విద్యార్థులను) రెచ్ఛగొడుతున్నాయని పేర్కొన్నారు. ‘ ‘కాంగ్రెస్ పార్టీ అబధ్ధాలు, అసత్యాలను వ్యాప్తి చెందింపజేస్తోంది.. ఈ చట్టంపై ముస్లిములలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది ‘ అని మోదీ ఆరోపించారు. ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఈ చట్టం వల్ల హాని జరగదని హామీ ఇస్తున్నానని అన్నారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఆయన విద్యార్థిలోకాన్ని కోరారు.
అటు-హోం మంత్రి అమిత్ షా..కూడా.. ఈ కొత్త చట్టాన్ని విద్యార్థులు మొదట స్టడీ చేయాలని అన్నారు. అయితే ఆయన ఇలా చెప్పడం సిగ్గుచేటని, ఈ చట్టాన్నిప్రభుత్వం ఉపసంహరించుకునేంతవరకు తాము నిరసన విరమించేది లేదని ముంబైలోని టాటా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు ఆవేశంగా స్పందించారు.