హైదరాబాద్‌ వెదర్‌తో కంగనకు కవిత కట్టలు తెంచుకుంది

|

Oct 12, 2020 | 10:13 AM

ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ పరవశించిపోతోంది. హైదరాబాద్‌ వాతావరణం, ప్రకృతి అందాలు చూసి కంగనకు కవిత్వం కట్టలు తెంచుకుంది. స్వతహాగా మంచి రైటర్ అయిన ఆమె, ఈ ఉదయం తన బెడ్ రూంలోకి పడుతున్న సూర్యోదయాన్ని చూసి పలువురితో పంచుకోకుండా ఉండలేకపోయింది. ఫొటో ఉంచి మరీ తన మనసులోని మాట బయటపెట్టింది. హైదరాబాద్ అందంగా ఆహ్లాదకరంగా ఉంది. తిరిగి హిమాలయల్లో శరదృతువును ఆశ్వాదిస్తున్నట్టుంది. సూర్యోదయాన ప్రకాశిస్తున్న సూర్యుడు మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఉదయపు […]

హైదరాబాద్‌ వెదర్‌తో కంగనకు కవిత కట్టలు తెంచుకుంది
Follow us on

ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ పరవశించిపోతోంది. హైదరాబాద్‌ వాతావరణం, ప్రకృతి అందాలు చూసి కంగనకు కవిత్వం కట్టలు తెంచుకుంది. స్వతహాగా మంచి రైటర్ అయిన ఆమె, ఈ ఉదయం తన బెడ్ రూంలోకి పడుతున్న సూర్యోదయాన్ని చూసి పలువురితో పంచుకోకుండా ఉండలేకపోయింది. ఫొటో ఉంచి మరీ తన మనసులోని మాట బయటపెట్టింది. హైదరాబాద్ అందంగా ఆహ్లాదకరంగా ఉంది. తిరిగి హిమాలయల్లో శరదృతువును ఆశ్వాదిస్తున్నట్టుంది. సూర్యోదయాన ప్రకాశిస్తున్న సూర్యుడు మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఉదయపు సూర్యుడి వెచ్చదనంతో కూడిన చిన్నపాటి చల్లదనం అద్భుతంగా ఉందంటూ కంగనా చిరునవ్వు చిందిస్తూ చెప్పుకొచ్చింది.