తెలంగాణ రాష్ట్రంలోకి ఈశాన్య, ఉత్తర దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. యాంటీ సైక్లోనిక్ ఒకటి సెంట్రల్ ఇండియా పరిసర ప్రాంతంలో ఉండటం వలన తెలంగాణ మీదుగా చలిగాలులు వీస్తున్నాయని ఆమె వెల్లడించారు. అందుకోసమే, ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆమె వివరణ ఇచ్చారు. ఫలితంగా రానున్న రెండుమూడురోజుల్లో తెలంగాణలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఆమె టీవీ9కు స్పష్టం చేశారు.