Hyderabad To Vishakapatnam Train: 2020 మార్చిలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రైల్వే శాఖ పలు ట్రైన్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం కొన్ని స్పెషల్ ట్రైన్ సర్వీసులు మాత్రమే అందిస్తోంది. అయితే 2020లో కోవిడ్ కారణంగా రద్దయిన కాచిగూడ-విశాఖపట్నం ట్రైన్ తిరిగి పరుగులు పెట్టనుంది. ఈ నెల 11 తేదీ నుంచి ఈ సర్వీసును ప్రారంభించనున్నట్లు సబర్బన్ ట్రైన్ ట్రావెల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూర్ వివరించారు. 11 నుంచి ప్రతిరోజూ ఈ సర్వీసు నడుస్తుందని చెప్పారు. ట్రైన్ నెం.08562 కాచిగూడ నుంచి సాయంత్రం 6.25కు స్టార్టవుతుంది. ఆ తర్వాత మల్కాజిగిరికి 6.39కి చేరుకుని 6.40కి బయలుదేరి నెక్ట్స్ డే ఉదయం 6.50కు విశాఖపట్నం చేరుకుంటుందని వెల్లడించారు.
సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్‌లో చదువుకుంటున్న యువతలో పాటు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తోన్న విశాఖ జనాలు ఈ సర్వీసు పున: ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఎస్‌ఆర్టీసీ సైతం పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీకి వెళ్లే వారికి కోసం ప్రత్యేక సర్వీసులను అందిస్తుంది.
Also Read :