భాగ్యనగరానికి తాజాగా మరో ప్రపంచ ఖ్యాతి దక్కింది. కాస్ట్-ఎఫెక్టివ్ నెస్‌లో టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ కేటగిరీ కింద హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. 2020-21 ర్యాంకింగ్‌లోని ఏరోస్పేస్ సిటీస్‌లో మన హైదరాబాద్ ఈ ఘతన సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యాపినింగ్ హైదరాబాద్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కేటీఆర్.