ఆ కారు నంబర్‌ ‘AP CM JAGAN’..ఇందులో ట్విస్టు ఉంది బ్రదర్

|

Oct 23, 2019 | 6:12 PM

కారు వెనుక అద్దాలపై తమకు ఇష్టమైన పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ బొమ్మలు, నేమ్స్ వేయించుకోవడం సహజం. ఎవరి అభిమానం వాళ్లది కాబట్టి దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఏకంగా నెంబర్ ప్లేట్‌కి బదులు..ఏపీ సీఎం నేమ్‌నే వేయించుకోని తిరుగుతున్నాడు ఓ వ్యక్తి. దీంతో సదరు యువకుడిపై హైదరాబాద్‌లోని జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే జీడిమెట్ల పైప్‌లైన్‌ రోడ్డులో ఈనెల 19న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన […]

ఆ కారు నంబర్‌ AP CM JAGAN..ఇందులో ట్విస్టు ఉంది బ్రదర్
Follow us on

కారు వెనుక అద్దాలపై తమకు ఇష్టమైన పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ బొమ్మలు, నేమ్స్ వేయించుకోవడం సహజం. ఎవరి అభిమానం వాళ్లది కాబట్టి దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఏకంగా నెంబర్ ప్లేట్‌కి బదులు..ఏపీ సీఎం నేమ్‌నే వేయించుకోని తిరుగుతున్నాడు ఓ వ్యక్తి. దీంతో సదరు యువకుడిపై హైదరాబాద్‌లోని జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే జీడిమెట్ల పైప్‌లైన్‌ రోడ్డులో ఈనెల 19న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారును ఆపిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు నంబర్ ప్లేట్ కు బదులు AP CM Jagan అని రాసి ఉంది. ఇక్కడే ఆ వ్యక్తి అసలు ట్విస్టు రివీల్ చేశాడు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించగా.. పోలీసుల తనిఖీలు, టోల్‌ ఫీజుల మినహాయింపు కోసం అని కారు యజమాని ముప్పిడి హరి రాకేశ్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో కారును సీజ్‌ చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలా నాయకుల ఇమేజ్‌కు డ్యామేజ్ తెచ్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  కాగా కారు యజమాని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం.