సైబర్‌నేరగాళ్లపై పోలీసుల ఫోకస్… భరత్‌పూర్ చీటర్లపై పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన
సైబర్‌నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ర్టాలకు చెందిన కరుడు గట్టిన సైబర్‌నేరగాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ నేరగాళ్లు మోసాలకు..

సైబర్‌నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ర్టాలకు చెందిన కరుడు గట్టిన సైబర్‌నేరగాళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నవారిని గుర్తించారు. అయితే ఇలాంటి నేరస్తులపై చాలా రాష్ర్టాల్లో కేసులు నమోదవుతున్నాయి.
బెయిల్‌పై బయటకు వెళ్లారంటే, పోలీసులకు చిక్కకుండా అమాయకులను మోసం చేసే అవకాశముండటంతో ఈ విషయంపై సైబర్‌క్రైమ్ పోలీసులు నెట్టింట్లో తీగ లాగుతున్నారు. సిమ్ స్వాపింగ్‌లో అరెస్టయిన కోల్‌కతా ముఠా, ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న రాజస్తాన్ భరత్‌పురా సైబర్‌నేరగాళ్ల ముఠాలపై ఇప్పుడు దృష్టి సారించారు.
కోల్‌కతా ముఠాపై హైదరాబాద్, సైబరాబాద్, ముంబై ప్రాంతాల్లో కేసులున్నాయి. భరత్‌పూర్ చీటర్లపై హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాల్లో వందల సంఖ్యలో కేసులున్నాయి. భరత్‌పు రా సైబర్‌నేరగాళ్లను ఇప్పటికే ఆయా రాష్ర్టాల పోలీసులు పీటీ వారెంట్లపై కస్టడీలోకి తీసుకుంటూ విచారిస్తున్నారు. ఈ సైబర్‌నేరగాళ్లు బయటకు వెళ్లే ప్రమాదముందని నగర పోలీసులు భావిస్తున్నారు.