ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కోట్లు సంపాధించాడు

|

Aug 24, 2020 | 8:15 PM

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. పాత బస్తీకి చెందిన ఫరీద్ గత కొంత కాలంగా ఇలాంటి మోసాలకు తెరలేపాడు...

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కోట్లు సంపాధించాడు
Follow us on

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. పాత బస్తీకి చెందిన ఫరీద్ గత కొంత కాలంగా ఇలాంటి మోసాలకు తెరలేపాడు. నిరుద్యోగ యువకులనే టార్గెట్‌గా చేసుకుని దందాకు తెరలేపాడు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ అమాయకులకు వల వేయడం.. వారి నుంచి అందినకాడికి దోచుకోవడమే వృత్తిగా పెట్టుకున్నాడు.

మోసపోయామని తెలుసుకున్న కొందరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఫరీద్‌ను పట్టుకున్నారు. తీగ లాగితే డంక కదిలింది. ఇప్పటి వరకు చాలా మందిని మోసం చేసినట్లుగా నిర్ధరించారు. ఉద్యోగాల పేరుతో ఇప్పటి వరకు రెండు కోట్లు వసూలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫరీద్‌ను కోర్టులో హాజరుపర్చినట్లుగా పోలీసులు వెల్లడించారు.