హైదరాబాద్: ‘ఆమె’ ఆధ్వర్యంలో గ్యాబ్లింగ్ దందా..11 మంది అరెస్ట్

|

Nov 01, 2020 | 6:40 PM

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ వెంకటగిరి కాాలనీలో గ్యాంబ్లింగ్ ముఠా ఆట కట్టించారు టాస్క్‌పోర్స్ పోలీసులు.

హైదరాబాద్: ఆమె ఆధ్వర్యంలో గ్యాబ్లింగ్ దందా..11 మంది అరెస్ట్
Follow us on

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ వెంకటగిరి కాాలనీలో గ్యాంబ్లింగ్ ముఠా ఆట కట్టించారు టాస్క్‌పోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు చేసి త్రి కార్డ్స్ గ్యాబ్లింగ్ ఆట ఆడుతోన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పద్మజ అనే మహిళ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు జూబ్లిహిల్స్ పోలీసులు తెలిపారు. గేమ్‌లో పాల్గొనేవారి వద్ద నుంచి ఆమె కమిషన్ తీసుకుంటూ ఈ దందా నిర్వహిస్తుందని చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..వారిని జూబ్లిహిల్స్ స్టేషన్‌కు తరలించి..నోటీసుల ఇచ్చారు. నిందితలుపై టీస్ గ్యాబ్లింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అన్ని రకల గ్యాబ్లింగ్ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Also Read :

అదే ప్రేమను కొనసాగించాల్సింది నోయల్ !

800 మంది అతిథులతో పెళ్లి వేడుకలు.. రూ.లక్ష ఫైన్