దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలయ్యాయి. శనివారం ఉప ఎన్నికలను ప్రకటించిన సిఈసీ సునీల్ అరోరా. అలాగే.. తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రస్తావించారు. అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే.. అక్టోబర్ 24నే ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా.. 64 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఒక పార్లమెంట్ స్థానం.. బీహార్‌లోని సమస్తిపూర్‌లో బై ఎలక్షన్స్ జరగనున్నాయి.
64 అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడంటే:
అరుణాచల్ ప్రదేశ్-5, అసోం-4, బీహార్-5, ఛత్తీస్ గఢ్-1, గుజరాత్-4, హిమాచల్ ప్రదేశ్-2, కర్ణాటక-15, కేరళ-5, మధ్య ప్రదేశ్-1, మేఘాలయ-1, పాండిచ్చేరి-1, ఒడిషా-1, పంజాబ్-4, రాజస్థాన్-2, సికిం-3, తమిళనాడు-2, తెలంగాణ-1, యూపీ-11