విగత జీవులుగా విహాంగాలు..నేలరాలిన వందల పక్షులు

యూకేలోని నార్త్‌వేల్స్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో హాయిగా ఎగరాల్సిన పక్షులు..వందల సంఖ్యలో నేలరాలిపడ్డాయి. గాల్లో ఎగురుతూనే హఠాత్తుగా చచ్చిపోయి పడిపోయాయి. ఒకటి, రెండు కాదు..ఏకంగా వందల సంఖ్యలో పక్షులు రోడ్డుపై చచ్చిపోయి పడి ఉండటం గమనించిన స్థానిక మహిళ ఒకరు వాటిని తన సెల్‌ఫోన్‌ కెమెరాతో వీడియో తీశారు. ఆ మహిళ డాక్టర్‌ కావడంతో వెంటనే ఆ వీడియోను ఆమె భర్తకు షేర్‌ చేసింది. ఉదయం తాను ఆస్పత్రికి వెళ్లేప్పుడు పక్షులు గుంపుగా ఎగరడం చూశాను..కానీ […]

విగత జీవులుగా విహాంగాలు..నేలరాలిన వందల పక్షులు

Edited By:

Updated on: Dec 13, 2019 | 7:34 PM

యూకేలోని నార్త్‌వేల్స్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో హాయిగా ఎగరాల్సిన పక్షులు..వందల సంఖ్యలో నేలరాలిపడ్డాయి. గాల్లో ఎగురుతూనే హఠాత్తుగా చచ్చిపోయి పడిపోయాయి. ఒకటి, రెండు కాదు..ఏకంగా వందల సంఖ్యలో పక్షులు రోడ్డుపై చచ్చిపోయి పడి ఉండటం గమనించిన స్థానిక మహిళ ఒకరు వాటిని తన సెల్‌ఫోన్‌ కెమెరాతో వీడియో తీశారు. ఆ మహిళ డాక్టర్‌ కావడంతో వెంటనే ఆ వీడియోను ఆమె భర్తకు షేర్‌ చేసింది.

ఉదయం తాను ఆస్పత్రికి వెళ్లేప్పుడు పక్షులు గుంపుగా ఎగరడం చూశాను..కానీ తిరిగి వచ్చేసరికి వందలాది పక్షులు రోడ్డుపై చచ్చిపోయిపడి ఉన్నాయని, వాటిలో కొన్ని చనిపోయే పరిస్థితిలో ఉన్నాయని తెలిపింది. దీంతో వెంటనే ఆమె భర్త కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఆ పక్షుల్ని లెక్కపెట్టారు. 300లకు పైగా పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. పక్షుల మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన పక్షుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా విహాంగాల మరణంపై స్థానికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో కీడుకు సంకేతంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, పక్షి ప్రేమికులు మాత్రం జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.