కరోనాపై 100 ఏళ్ల వృద్ధ ‘యోధుడి’ విజయం

|

Mar 09, 2020 | 1:49 PM

100 ఏళ్ల చైనా వ్యక్తి మహమ్మారి కరోనావైరస్ నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఈ వార్త వినిడానికి ఆశ్చర్యంగా ఉన్నా..పూర్తిగా నిజం. ప్రాణాంతక కరోనా సోకిన అతి వృద్ద రోగిగా అతన్ని గుర్తించారు.  గత నెలలో తన 100వ పుట్టినరోజును పూర్తి చేసుకున్న వ్యక్తి కరోనాతో ఆస్పత్రిలో చేరగా,  వ్యూహాన్‌లోని ఒక ఆసుపత్రి నుండి శనివారం అతడిని డిశ్చార్జ్ చేశారని చైనా రాష్ట్ర వార్తా సంస్థ సిన్‌హువా వెల్లడించింది. కరోనావైరస్ వ్యాప్తితో ఫిబ్రవరి 24 న 100 ఏళ్ల […]

కరోనాపై 100 ఏళ్ల వృద్ధ యోధుడి విజయం
Follow us on

100 ఏళ్ల చైనా వ్యక్తి మహమ్మారి కరోనావైరస్ నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఈ వార్త వినిడానికి ఆశ్చర్యంగా ఉన్నా..పూర్తిగా నిజం. ప్రాణాంతక కరోనా సోకిన అతి వృద్ద రోగిగా అతన్ని గుర్తించారు.  గత నెలలో తన 100వ పుట్టినరోజును పూర్తి చేసుకున్న వ్యక్తి కరోనాతో ఆస్పత్రిలో చేరగా,  వ్యూహాన్‌లోని ఒక ఆసుపత్రి నుండి శనివారం అతడిని డిశ్చార్జ్ చేశారని చైనా రాష్ట్ర వార్తా సంస్థ సిన్‌హువా వెల్లడించింది.

కరోనావైరస్ వ్యాప్తితో ఫిబ్రవరి 24 న 100 ఏళ్ల వ్యక్తి హుబీ.. ప్రసూతి, శిశు ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రిలో చేరారు. పరిక్షలు చేసిన వైద్యులు ప్లూ లక్షణాలతో పాటు అతడు అల్జీమర్స్ వ్యాధి, రక్తపోటు,  గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో 13 రోజులు పాటు అతడికి  యాంటీవైరల్ మందులు, ప్లాస్మా చికిత్సతో పాటు సాంప్రదాయ చైనీస్ మెడిసిన్‌ను అందించారు. కరోనా నుంచి కోలుకున్న 80 మంది రోగులతో పాటు ఈ వృద్దుడిని కూడా శనివారం డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. వాస్తవానికి కరోనా మరణాల రేటు వృద్దులలోనే ఎక్కువగా ఉంది. కాని 100 ఏళ్ల వృద్దుడు మహమ్మారి కరోనావైరస్ బారి నుంచి బయటపడటం అరుదైన విషయమనే చెప్పాలి.  చైనాలో 80,000 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవ్వగా, వ్యాధికి గురయ్యి మరణించినవారి సంఖ్య 3000 పైగా పెరిగింది.