Jallikattu in Madurai : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. పోటీలో 658 మంది, 790 ఎద్దులు సిద్ధం.. ఇక కుమ్మడే..

|

Jan 15, 2021 | 8:40 AM

తమిళనాడులో జోరుగా సాగుతోంది జల్లకట్టు. ఈ రోజు మధురై జిల్లా పాలమేడులో జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు. పోటీలలో పాల్గొనడానికి 658 మంది పోటీదారులు, 790 ఎద్దులు సిద్ధమయ్యాయి..

Jallikattu in Madurai : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. పోటీలో 658 మంది, 790 ఎద్దులు సిద్ధం.. ఇక కుమ్మడే..
Follow us on

Jallikattu in Madurai : తమిళనాడులో జోరుగా సాగుతోంది జల్లకట్టు. ఈ రోజు మధురై జిల్లా పాలమేడులో జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు. పోటీలలో పాల్గొనడానికి 658 మంది పోటీదారులు, 790 ఎద్దులు సిద్ధమయ్యాయి.
పోటీలలో గెలుపొందిన వీరుడికి కారును బహుమానంగా ప్రకటించింది పాలమేడు జల్లికట్టు కమిటీ. నిన్న జరిగిన అవనీయపురం పోటీలలో 60 మందికి గాయాలయ్యాయి. దీంతో నేటి పోటీలలో వైద్యబృందాలను అప్రమత్తం చేశారు అధికారులు. 1,500 మంది పోలీసులను మోహరించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో సాంప్రదాయ జల్లికట్టు జోరుగా సాగుతోంది. మొన్న చంద్రగిరి మండలం కొత్తశానం బట్లలో జల్లికట్టు నిర్వహించారు. నిన్న రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జల్లికట్టును వేడుకగా
ప్రారంభించారు. ఇవాళ రంగంపేట రెడీ అయింది. పోలీసుల ఆంక్షల మధ్యే జల్లికట్టు నిర్వాహిస్తున్నారు.

ఈ జల్లికట్టులో పాల్గొనేందుకు యువకులు భారీగా తరలివస్తున్నారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పొగరబోతు గిత్తలను తీసుకువస్తున్నారు. దీంతో ఆయా గ్రామాలు సందడిగా మారాయి. పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ జోరుగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి.

పోట్లగిత్తలను పట్టుకొని నిలువరించడం కోసం యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపిస్తున్నారు. జల్లికట్టు పోటీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అవేవి పట్టించుకోకుండా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు.