ఎస్సెస్సీ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..

| Edited By:

Jun 04, 2020 | 5:27 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలో

ఎస్సెస్సీ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మూతబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు నేడు తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. విద్యార్థుల కోసం హాస్టళ్లు తెరుచుకోడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 18 వేల మంది విద్యార్థులు వసతి గృహాలకు వచ్చే అవకాశం ఉంది.

ఈ క్రమంలో.. హాస్టళ్లలో విద్యార్థులకు కల్పించాల్సిన ప్రత్యేక సౌకర్యాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులు మాస్కు‌లు ధరించడం, భౌతికదూరం పాటించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. గదికి ఐదుగురినే ఉంచాలి. విద్యార్థుల్లో రోగ నిరోధకశక్తి పెంచేలా పండ్ల రసాలు, పండ్లు, స్నాక్స్‌ను రోజువారీ ఆహారంతోపాటు అందించాలి. విద్యార్థులను బృందాలుగా చేసి ప్రత్యేకగదుల్లో భోజనానికి ఏర్పాట్లుచేయాలి. విద్యార్థులను ప్రైవేటువాహనాల్లో పరీక్షాకేంద్రాలకు తరలించాలి.