Home Ministry Orders: తమిళ సర్కార్‌కు కేంద్రం ‘మాస్టర్‘ స్ట్రోక్.. 100 శాతం సీటింగ్ అనుమతికి హోంశాఖ బ్రేక్

|

Jan 06, 2021 | 7:47 PM

Home Ministry Orders: సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సీట్ల సామర్ధ్యాన్ని 100 శాతానికి పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన..

Home Ministry Orders: తమిళ సర్కార్‌కు కేంద్రం ‘మాస్టర్‘ స్ట్రోక్.. 100 శాతం సీటింగ్ అనుమతికి హోంశాఖ బ్రేక్
Follow us on

Home Ministry Orders: సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సీట్ల సామర్ధ్యాన్ని 100 శాతానికి పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు కేంద్రం బ్రేక్ వేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపధ్యంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభ్యర్ధన మేరకు తమిళనాడు సీఎం పళనిస్వామి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సీటింగ్ సామర్ధ్యానికి వంద శాతానికి పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. ఇది విపత్తు నిర్వహణను ఉల్లంఘించడం అని పేర్కొంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. కేంద్రం ఇచ్చిన కరోనా మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

Also Read:

కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!