ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మాత్రం మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. రాయ్‌బరేలీ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ 370 అధికరణ రద్దును సమర్థించారు. ఈ నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉందన్నారు. 370 రద్దును రాజకీయం చేయొద్దని అదితి సూచించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆమె కొనియాడారు.
ఒక ఎమ్మెల్యేగా 370 అధికరణ రద్దును స్వాగతిస్తున్నానని అదితి సింగ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ వైఖరితో సొంత పార్టీ నేతలు కంగు తిన్నారు. అదితి సింగ్‌తో పాటు మరికొందరు నేతలు పార్టీ వైఖరిపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని అధికరణలను దారుణంగా కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను ముక్కలు చేసిందని కాంగ్రెస్ కీలక నేతలు వ్యాఖ్యానించారు.
[svt-event date=”06/08/2019,3:26PM” class=”svt-cd-green” ]