మరో ఆరు నెలల తర్వాతే.. నూతన నియామకాలు..!

| Edited By:

Jul 10, 2020 | 6:18 AM

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. కాగా.. నూతన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్‌మెంట్‌ సంస్థ

మరో ఆరు నెలల తర్వాతే.. నూతన నియామకాలు..!
Follow us on

దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. కాగా.. నూతన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్‌మెంట్‌ సంస్థ కెరీర్‌నెట్‌ కన్సల్టింగ్‌ సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో క్యాంపస్‌ నియామకాలూ నిలిచిపోయాయని, హైరింగ్‌ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపింది. కరోనా కారణంగా నియామకాలను నిలిపివేసిన కంపెనీలు కూడా ఆరు నెలల తర్వాత చురుకుగా హైరింగ్‌ చేపడతామని పేర్కొన్నాయి.

వివరాల్లోకెళితే.. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళతామని వెల్లడించాయని సంస్థ పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నాటికి కోవిడ్‌-19కు ముందున్న పరిస్థితి నెలకొంటుందని కెరీర్‌నెట్‌ సహవ్యవస్ధాపకులు అన్షుమన్‌ దాస్‌ అంచనా వేశారు. మరోవైపు క్యాంపస్‌ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.