ఊపందుకున్న హైరింగ్‌.. 5 శాతం పెరిగిన నియామకాలు..!

| Edited By:

Aug 12, 2020 | 9:08 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులు, కీలక పరిశ్రమలు తెరుచుకోవడంతో భారత్‌లో నియామకాల ప్రక్రియ

ఊపందుకున్న హైరింగ్‌.. 5 శాతం పెరిగిన నియామకాలు..!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపులు, కీలక పరిశ్రమలు తెరుచుకోవడంతో భారత్‌లో నియామకాల ప్రక్రియ ఊపందుకుందని నౌకరీ జాబ్ సీక్‌ పేర్కొంది. జులైలో దేశవ్యాప్తంగా హైరింగ్‌ ప్రక్రియ అంతకుముందు నెలతో పోలిస్తే 5 శాతం పెరిగిందని వెల్లడైంది. జులైలో నియామకాలు అధికంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో 36 శాతం, హెచ్‌ఆర్‌లో 37 శాతం, నిర్మాణ ఇంజనీరింగ్‌ రంగాల్లో 27 శాతంగా ఉన్నాయని తెలిపింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగంలో 16 శాతం, ఆటోమొబైల్స్‌లో 14 శాతం, టెలికాం పరిశ్రమలో 13 శాతం మేర హైరింగ్‌ ప్రక్రియలో వృద్ధి నమోదైంది. ఐటీ హార్డ్‌వేర్‌ రంగంలో 9 శాతం మేర హైరింగ్‌ ప్రక‍్రియ జరగ్గా, ఐటీ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి హైరింగ్‌ జోరూ కనిపించలేదని నౌకరీ జాబ్‌స్పీక్‌ పేర్కొంది. అయితే విద్యా బోధనా రంగంలో -22 శాతం, ఆతిథ్య రంగంలో -5 శాతం, రిటైల్‌లో -2 శాతం మేర హైరింగ్‌ ప్రక్రియలో క్షీణత నమోదైంది.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!