పాక్‌లో హిందూ దేవాలయాలపై దాడులు

పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆదివారం పాక్‌లోని సింధ్ ప్రావిన్స్  ఘెట్కీ పట్టణంలో  ఓ స్కూల్ హిందూ ప్రిన్సిపాల్.. దైవ దూషణ చేశాడనే ఆరోపణపై  ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  స్ధానికంగా నివాసమున్న హిందువుల ఇళ్లు, షాపులు, ఆలయాలను టార్గెట్ చేసుకుని కొంతమంది దాడులకు తెగబడ్డారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై పాక్ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ దాడుల్లో పలు దేవాలయాలు, షాపులు, పలు హిందువుల నివాసాలు […]

పాక్‌లో హిందూ దేవాలయాలపై దాడులు

Edited By:

Updated on: Sep 16, 2019 | 12:27 PM

పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఆదివారం పాక్‌లోని సింధ్ ప్రావిన్స్  ఘెట్కీ పట్టణంలో  ఓ స్కూల్ హిందూ ప్రిన్సిపాల్.. దైవ దూషణ చేశాడనే ఆరోపణపై  ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  స్ధానికంగా నివాసమున్న హిందువుల ఇళ్లు, షాపులు, ఆలయాలను టార్గెట్ చేసుకుని కొంతమంది దాడులకు తెగబడ్డారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై పాక్ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ దాడుల్లో పలు దేవాలయాలు, షాపులు, పలు హిందువుల నివాసాలు ధ్వంసమైనట్టుగా మానవహక్కుల సంస్థ ట్వీట్ చేసింది. అల్లరిమూకలకు భయపడి హిందువులు తమ ఇళ్లనుంచి బయటకు రావడం లేదని హక్కుల కార్యకర్త ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పాక్‌లో మత మైనారిటీలకు రక్షణ కల్పించే విధంగా తమ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని విఙ్ఞప్తి చేసింది.

ఈ దాడులపై స్ధానిక పోలీసులు స్పందిస్తూ ఘెట్కీ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని పేర్కొన్నట్టు పాక్ మీడియా తెలిపింది. అదే సమయంలో దైవ దూషణకు పాల్పడ్డ స్కూల్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా పేర్కొంది. ఈ దాడులు ఘెట్కి పట్టణంతో పాటు మీర్‌పూర్ మథెలో, అదిల్‌పూర్ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగినట్టుగా పాక్ నుంచి వెలువడే డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.