కరిగిపోతున్న హిమాలయాలు.. వాతావరణంలో మార్పులే కారణమా..?

వాతావరణ మార్పులు.. పెరుగుతున్న ఎండల తీవ్రత హిమాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. 21వ శతాబ్దం మొదలుకొని హిమాలయాల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని పరిశోధనలో తేలింది. ప్రతియేటా అడుగున్నర ఎత్తున ఇవి కరిగిపోతున్నాయని, భవిష్యత్‌లో భారత్‌తో సహా కోట్లమంది ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 1975 నుంచి 2000లతో పోలిస్తే 2000లో రెట్టింపు స్థాయిలో ఏటా మంచు కరిగిపోతోందని తేల్చింది. భారత్, చైనా, భూటాన్ మీదుగా వ్యాపించిన హిమాలయ […]

కరిగిపోతున్న హిమాలయాలు.. వాతావరణంలో మార్పులే కారణమా..?

Updated on: Jun 21, 2019 | 12:21 PM

వాతావరణ మార్పులు.. పెరుగుతున్న ఎండల తీవ్రత హిమాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. 21వ శతాబ్దం మొదలుకొని హిమాలయాల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని పరిశోధనలో తేలింది. ప్రతియేటా అడుగున్నర ఎత్తున ఇవి కరిగిపోతున్నాయని, భవిష్యత్‌లో భారత్‌తో సహా కోట్లమంది ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 1975 నుంచి 2000లతో పోలిస్తే 2000లో రెట్టింపు స్థాయిలో ఏటా మంచు కరిగిపోతోందని తేల్చింది. భారత్, చైనా, భూటాన్ మీదుగా వ్యాపించిన హిమాలయ పర్వతాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిశోధకులు అధ్యయనం చేశారు. తూర్పు నుంచి పశ్చిమం వరకు 2వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న 650 హిమఖండాల ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించారు. మొత్తం 40 యేళ్ల ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశారు. వాతావరణ మార్పుల వల్లే హిమనీనదాలు కరిగిపోతున్నాయని తేల్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us