supreme court chief justice:మహిళలంటే అత్యంత గౌరవమని, వారిని కించపరచాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే స్పష్టం చేశారు. ఓ రేప్ కేసు విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుడుగా ‘మిస్ రిపోర్ట్’ చేశారని, అది వారిని అవమానపరిచే విధంగా ఉందని ఆయన అన్నారు. కోర్టు ఎప్పుడూ మహిళలకు అత్యంత గౌరవాన్ని ఇస్తుంది.. జుడిషియరీ ప్రతిష్ట ఈ నాయస్థానం లాయర్లపై, ‘బార్’ చేతుల్లో ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ రేప్ కేసు విచారణ గురించి ఆయన ప్రస్తావించారు. మహారాష్ట్రలో ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థలో పని చేస్తున్న మోహిత్ సుభాష్ చవాన్ అనే వ్యక్తి ఓ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ కేసు విచారణ ఈనెల 1 న కోర్టుముందుకు వచ్చింది. చవాన్ ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు కోర్టుకెక్కాడు .. ఈ కేసు విచారణ సందర్భంగా సందర్భంగా కోర్టు… నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇందుకు సాయపడతామని, లేదా అతడు ఉద్యోగం కోల్పోయి జైలు పాలు కావాల్సి వస్తుందని పేర్కొంది. నువ్వు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశావు.. వివాహం చేసుకోగోరుతున్నావా అని ప్రశ్నించింది.
అయితే దీనిపై మేధావులు, యాక్టివిస్టులు కోర్టుపై మండిపడ్డారు. రేప్ కి పరిష్కారం పెళ్లి కాదని, నిందితుడికి శిక్ష పడాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి తన ఉత్తర్వులకు క్షమాపణ చెప్పాలని, లేదా రాజీనామా చేయాలంటూ సుమారు 5 వేలమంది సంతకాలతో ఓ పిటిషన్ రూపొందించి దాదాపు ఉద్యమం వంటిది చేపట్టారు.అయితే బాధితురాలికి 18 ఏళ్ళు వచ్చి ఆమె మేజర్ అయ్యాక ఆమెను వివాహం చేసుకుంటానని నిందితుడు లిఖితపూర్వక హామీ ఇఛ్చాడని సుప్రీంకోర్టు రికార్డులు తెలిపాయి. కాగా ఈ అంశంలో పూర్తి అపోహలు నెలకొన్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. కోర్టు మరో విధంగా స్పందించిందనిసొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా పేర్కొన్నారు. కోర్టుకు మహిళలంటే ఎంతో గౌరవం ఉందని, వారిని కించపరిచే ఎలాంటి వ్యాఖ్యలూ చేయదని ఆయన అన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
48 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చిన 10 సెకన్ల వీడియో..ఈ వీడియో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?