Malavika Insta Post: లాయర్‌ అయిన యాక్టర్‌… మీ కలలను ఫాలో అవ్వండి అంటూ సందేశం..

|

Jan 06, 2021 | 2:03 PM

Malavika Became Lawyer: చాలా మందికి కెరీర్‌ ఒకటి అయితే ప్యాషన్‌ మరొకటి ఉంటుంది. అయితే ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. అయితే..

Malavika Insta Post: లాయర్‌ అయిన యాక్టర్‌... మీ కలలను ఫాలో అవ్వండి అంటూ సందేశం..
Follow us on

Malavika Became Lawyer: చాలా మందికి కెరీర్‌ ఒకటి అయితే ప్యాషన్‌ మరొకటి ఉంటుంది. అయితే ఈ రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. కెరీర్‌ కోసం ప్యాషన్‌ను లేదా ప్యాషన్‌ కోసం కెరీర్‌ను వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అయితే వీటిని చక్కగా బ్యాలెన్స్‌ చేసింది అందాల తార మాళవిక శర్మ. ముంబైకి చెందిన మాళవిక శర్మ ‘నేల టికెట్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందు మాళవిక లాయర్‌ విద్యను అభ్యసించింది.
ఇదిలా ఉంటే సినిమాల్లోకి వచ్చినా తన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు మాళవిక. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ‘లా ‘ను పూర్తి చేసింది. తాజాగా లాయర్ పట్టా పుచ్చుకున్న ఈ చిన్నది మహారాష్ట్ర & గోవా బార్ కౌన్సిల్ లో మెంబెర్ షిప్ సంపాదించింది. ఈ విషయాన్ని మాళవిక శర్మ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. అడ్వకేట్‌ ఐడీ కార్డుని పోస్ట్‌ చేస్తూ.. ‘మీ కలలను ఫాలో అవ్వండి.. వాటిని నిజం చేసుకోవడానికి నిర్భయంగా ఉండండి. తగిన ధైర్యం ఉంటే మన కలలన్నీ నిజమవుతాయి’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ చిన్నది హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘రెడ్‌’ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. మరి ‘లా’ పట్టా పొందిన మాళవిక.. సినిమాలను కొనసాగిస్తుందా లేదా.. ఫుల్‌ స్టాప్‌ పెడుతుందా చూడాలి.

మాళవిక చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్…

Also Read: చికెన్, గుడ్లు తినొచ్చు, ఏపీలో బర్డ్ ఫ్లూ లేదు, వలస పక్షులతో అప్రమత్తంగా ఉన్నాం: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్..