సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..

|

Nov 13, 2020 | 9:00 PM

లాక్‌డౌన్‌ సయమంలో వలస కార్మికులను, విద్యార్దులను వారి స్వస్థలాలకు చేర్చి యావత్ భారతదేశానికి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇలా ఎంతోమంది సాయం అందించిన సోనూసూద్ తనకు హెల్ప్ చేయమని ట్విట్టర్ వేదికగా నెటిజన్లను కోరారు.

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..
Follow us on

Hero Sonu Sood: కష్టాల్లో ఉన్నవారికి చేయూతను ఇస్తూ ఎంతోమంది పేదవారికి నటుడు సోనూసూద్ ఆర్ధిక సాయం అందించారు. లాక్‌డౌన్‌ సయమంలో వలస కార్మికులను, విద్యార్దులను వారి స్వస్థలాలకు చేర్చి యావత్ భారతదేశానికి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇలా ఎంతోమంది సాయం అందించిన సోనూసూద్ తనకు హెల్ప్ చేయమని ట్విట్టర్ వేదికగా నెటిజన్లను కోరారు.

”మేము 4 నెలల చిన్నారి అద్విత్‌ ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. వెంటనే బీ-నెగటివ్ బ్లడ్ గ్రూప్ 6 యూనిట్లు కావాలి. దయ చేసి ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ముందు వచ్చి రక్తం దానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడండి” అని నెటిజన్లను ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా సోనూసూద్ పేర్కొన్నారు.

ఇంకేముంది సోనూసూద్ సాయం అడిగేసరికి.. నెటిజన్లు వెంటనే స్పందించారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు సిద్దమయ్యారు. దాదాపు ఏడు మంది చిన్నారికి బ్లడ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని సురేష్ అనే నెటిజన్ సోనూకు ట్వీట్ చేశారు. దీనికి ”అద్విత్ ప్రాణాలు కాపాడేందుకు సాయం చేసిన హీరోలకు కృతజ్ఞతలు” అంటూ సోనూసూద్ రీ-ట్వీట్ చేశారు.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..