Diabetes: ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది డయాబెటిస్‌ వారు ఉన్నారో తెలుసా..? తాజా పరిశోధనలో వివరాలు వెల్లడి

ఒత్తిడితో కూడిన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం లాంటి అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి అలవాట్లు..

Diabetes: ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది డయాబెటిస్‌ వారు ఉన్నారో తెలుసా..? తాజా పరిశోధనలో వివరాలు వెల్లడి
జొన్న రొట్టె వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. జొన్నలో డైటరీ ఫైబర్ ఉంది. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటీన్లు, మెగ్నీషియం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది.

Updated on: Nov 20, 2022 | 9:56 AM

ఒత్తిడితో కూడిన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం లాంటి అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి అలవాట్లు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 8.7 మిలియన్ల మందికి టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. బ్రిటన్‌లో దాదాపు 400,000 మందికి టైప్ 1 మధుమేహం ఉంది. వీరిలో 29,000 మంది పిల్లల్లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మధుమేహం అనేది మీ జీవితకాలంలో వచ్చే ప్రధాన సమస్య. ఇది ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెంటాడుతోంది. ఇంటర్నేషనల్ 2018 ఆన్‌లైన్ సర్వే ప్రకారం.. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు అధిక దాహం, ఆకస్మిక బరువు తగ్గడం, అధిక అలసట, చిరాకు, కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. టైప్ 1 డయాబెటిస్‌లో రోగనిరోధక వ్యవస్థ (సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది) ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్‌లోని కీలక కణాలపై దాడి చేస్తుంది. ఇన్సులిన్ అనేది కడుపు వెనుక, దిగువ గ్రంధి నుండి వచ్చే హార్మోన్.

ఇవి కూడా చదవండి

టైప్ 1 – శరీరం రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. టైప్ 2 – ఇక్కడ శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. శరీర కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. ప్రస్తుతం డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కసారి డయబెటిస్‌ వచ్చిందంటే చాలు జీవన శైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి తప్ప.. పూర్తిగా నయం చేసుకోలేము. ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటూ, ప్రతి రోజు వ్యాయమం చేయడం తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. రోజు వారీ వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. ఇది ఎక్కువైతే ఇతర వ్యాధులకు తావిస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం అదుపులో లేకపోతే ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. కాలేయం దెబ్బతింటుంది. కిడ్నీల సమస్య ఏర్పడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..