Skin care Tips: మొటిమలతో ముఖం చూపించలేకపోతున్నారా? ఇవి ట్రై చేయండి.. సహజ సౌందర్యం మీ సొంతం..

|

Mar 25, 2023 | 6:30 PM

కొన్ని పోషకాలు, విటమిన్లు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలను నివారిస్తాయి. అలాంటి పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి? వాటి వల్ల చర్మానికి కలిగే ప్రయోజనం ఏంటి? చూద్దాం రండి.

Skin care Tips: మొటిమలతో ముఖం చూపించలేకపోతున్నారా? ఇవి ట్రై చేయండి.. సహజ సౌందర్యం మీ సొంతం..
Acne Prevent Tips
Follow us on

వేసవిలో చర్మ సంరక్షణ కొంచెం కష్టంగా ఉంటుంది. విపరీతమైన చెమట, ఉక్కపోతతో చర్మం జిడ్డుగా మారిపోతుంటుంది. దానికి తోడు ముఖంపై మొటిమలు కూడా ఉన్నాయంటే ఇంకా ఇబ్బంది ఎక్కువగానే ఉండే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమయంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో మీరు తీసుకొనే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్లు సమృద్ధిగా ఉండే విభిన్నమైన ఆహారంతో సహా స్పష్టమైన చర్మాన్ని ప్రోత్సహించే ఆహారాలు తినడం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే అవసరమైన పోషకాలు లేదా విటమిన్లు అందకపోవచ్చు. అటువంటి సమయంలో కొన్ని విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం. పోషకాహార నిపుణురాలైన అంజలి ముఖర్జీ మొటిమలతో పోరాడటానికి మీరు రోజువారీ భోజనంలో జోడించగల కొన్ని ముఖ్యమైన పోషకాలను వెల్లడించారు. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఓ విడియోను పోస్ట్ చేశారు. ఆమె మాట్లడుతూ మొటిమలు దాదాపు ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యుక్తవయస్సులో ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. పెద్దవారిలో కూడా ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తాయని.. ముఖం ఆరోగ్యంగా, మెరుస్తూ మొటిమలు లేకుండా ఉండటానికి మన చర్మానికి సరైన పోషకాల సమతుల్యతను అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొటిమలతో పోరాడడంలో సహాయపడే టాప్ 4 పోషకాలను ఆమె వివరించారు. అవేంటో ఓ సారి చూద్దాం..

ఇవి తగ్గించాలి..

నిర్దిష్ట పోషక పదార్ధాలతో పాటు, చక్కెర తీసుకోవడం తగ్గించడం కూడా చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగాన్ని తగ్గించాలి. పేగుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం.

ఇవి మేలు చేస్తాయి..

  • బీటా-కెరోటిన్, రెటిన్ ఎ రూపంలో ఉండే విటమిన్ ఎ ముఖ్యంగా స్పష్టమైన, మెరిసే చర్మానికి, యుక్తవయస్సులో ఏర్పడే మొటిమలను ఎదుర్కోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
  • జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా చర్యను అణిచివేస్తుంది.
  • ముఖం జిడ్డును నియంత్రించడంలో  బి-కాంప్లెక్స్ చాలా ముఖ్యమైనది.
  • విటమిన్ సి మొటిమల వ్యాప్తిని నిరోధిస్తుంది. దీనిని 1000-2000 mg మోతాదులో తీసుకోవాలి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..