జగన్‌కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు మంత్రులు..? ఎందుకు..?

| Edited By: Pardhasaradhi Peri

Oct 14, 2019 | 3:51 PM

ఏపీలో ఇద్దరు మంత్రుల ప్రవర్తన సీఎం జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఆ ఇద్దరు మంత్రులు దూకుడు తనం ప్రదర్శించడంతో.. ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నాయని సీనియర్ మంత్రులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఆ ఇద్దరు మంత్రులు ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఒకరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. మరొకరు మంత్రి అవంతి శ్రీనివాస్. వీరిద్దరి దూకుడు తనం.. జగన్‌కు ఇబ్బందిగా మారిందట. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్ […]

జగన్‌కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు మంత్రులు..? ఎందుకు..?
Follow us on

ఏపీలో ఇద్దరు మంత్రుల ప్రవర్తన సీఎం జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఆ ఇద్దరు మంత్రులు దూకుడు తనం ప్రదర్శించడంతో.. ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నాయని సీనియర్ మంత్రులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఆ ఇద్దరు మంత్రులు ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఒకరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. మరొకరు మంత్రి అవంతి శ్రీనివాస్.

వీరిద్దరి దూకుడు తనం.. జగన్‌కు ఇబ్బందిగా మారిందట. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్.. జగన్‌కు అంత్యంత సన్నిహితుడు. అందులోనూ యువ నాయకుడిగా.. అన్ని పనుల్లోనూ ముందుంటున్నారు. జగన్ వ్యూహాలను తూ.. చ.. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక అదే సమయంలోనూ.. ప్రతి పక్షంపై కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేయడం.. విమర్శలు చేయడంలో అనిల్‌ది అందవేసిన చేయ్యి అనే చెప్పవచ్చు. ఇటీవల అసెంబ్లీలో కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా బాగానే ఉన్నా.. తాజాగా.. అతను చేసిన వ్యాఖ్య ఒకటి.. పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిం చేసింది.

రాష్ట్రంలో కనీసం 30 ఏళ్ల పాటు అధికారాన్ని తన వద్దే ఉంచుకుంటానని జగన్.. అన్ని సభల్లోనూ.. పదే పదే.. చెబుతూ ఉండేవారు. కానీ.. తాజాగా.. అనిల్ మాత్రం మే 20 ఏళ్లు అధికారంలో ఉంటామని.. కృష్ణా జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పూజా కార్యక్రమంలో చెప్పిన విషయం.. అందరినీ ఒక్కసారిగా విస్మయానికి గురించేసింది. ప్రభుత్వానికి సంబంధం లేకుండా.. అనిల్ ప్రకటనలు చేస్తుండం కూడా మిగిలిన మంత్రులకు, ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారింది.

ఇక మరో మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యవహారం కూడా.. జగన్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోన్నాయి. ఇటీవల కాలంలో.. ఆయన మాజీ మంత్రి చంద్రబాబుపై కూడా నేరుగా.. ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో.. వైసీపీ ప్రభుత్వంలో.. మంత్రిగా అయిన కొద్దికాలంలోనే.. పలు వివాదాస్పద వ్యాఖ్యల్లో నిలిచారు. ఇప్పుడు మరో వివాదాస్పద వ్యాఖ్య చేసి.. జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు.

తాజాగా.. మంత్రి అవంతి శ్రీనివాస్.. వైఎస్సార్ వాహనమిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన ఆటో డ్రైవర్లను ఉద్దేశించి చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ‘ సీఎం జగన్ ఫొటోలు.. మీ ఆటోల వెనకాల అంటించుకోండి.. మీకు ఎలాంటి వేధింపులు ఉండవు.. ఆర్టీఏ డిపార్ట్‌మెంట్ ఏ కేసులు రాయదు’ అని అవంతి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇలా ఇద్దరు మంత్రులు దూకుడు ప్రదర్శిస్తుండడంతో ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నాయని సీనియర్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమాచారం.