బ్రేకింగ్: కరోనా బాధితుల్లో మరో ‘మూడు’ కొత్త లక్షణాలు..

|

Jun 28, 2020 | 1:47 PM

తాజాగా కరోనా వైరస్ లక్షణాల్లో కొత్తగా మరో మూడు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు.

బ్రేకింగ్: కరోనా బాధితుల్లో మరో మూడు కొత్త లక్షణాలు..
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు దశలవారీగా లాక్‌డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఇదిలా ఉంటే ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటగా.. 5,01,480 ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. ఇక ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు. అటు గొంతు మంట. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అని ఈ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ లక్షణాలన్నీ కూడా వైరస్ సోకిన 2-14 రోజుల్లోగా కనిపిస్తాయని సంస్థ పేర్కొంది.

ఇది చదవండి: టీఎస్ ఎంసెట్.. విద్యార్థులకు న్యూ ‘కరోనా’ రూల్..

కరోనా లక్షణాలు.. 

  • ఫీవర్
  • వణుకు
  • దగ్గు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • అలసట
  • ఒళ్లు నొప్పులు
  • తలనొప్పి
  • రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం
  • గొంతునొప్పి
  • ముక్కు దిబ్బడ
  • వాంతులు
  • డయేరియా