వాతావరణ హెచ్చరిక

దక్షిణ భారతంలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది...

వాతావరణ హెచ్చరిక

Updated on: Sep 01, 2020 | 3:40 PM

దక్షిణ భారతంలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పెద్దపెద్ద ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో భారీ వరదలకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. నేటి (సెప్టెంబర్ 1) నుంచి మూడు, నాలులు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అటు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అసోం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అప్రమత్తం చేసింది.