AP Rains: ఆంధ్రాలో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా
ఏపీకి అల్పపీడన ముప్పు తప్పింది. కానీ వర్ష ప్రభావం మాత్రం పూర్తిగా పోలేదు. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి.? అనే విషయాలను అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరి ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందామా..
నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర నైరుతిబంగాళాఖాత ప్రాంతమైన ఉత్తర తమిళనాడు & దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 23, 2024, 08.30 గంటలకు నైరుతి బంగాళాఖాతం, పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరంలో కొనసాగుతూ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదిలి డిసెంబర్ 24 నాటికి, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
————–
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- —————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ:-
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఇది చదవండి: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్