బెల్గాంలో భారీ వర్షం.. జనజీవితం అస్తవ్యస్థం

Heavy Rains : తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెల్గాంలో భారీ వర్షాలకు జనజీవితం అస్తవ్యస్థమయ్యింది. చాలా వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. కారు వరదనీటిలో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న వ్యక్తి ఓ స్తంభాన్ని పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. వరదల కారణంగా అపారనష్టం జరిగింది. బెల్గాంలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచించారు.మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని […]

బెల్గాంలో భారీ వర్షం.. జనజీవితం అస్తవ్యస్థం

Updated on: Oct 12, 2020 | 9:39 PM

Heavy Rains : తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెల్గాంలో భారీ వర్షాలకు జనజీవితం అస్తవ్యస్థమయ్యింది. చాలా వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. కారు వరదనీటిలో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న వ్యక్తి ఓ స్తంభాన్ని పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. వరదల కారణంగా అపారనష్టం జరిగింది.

బెల్గాంలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచించారు.మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

భారీవర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ముందుకు వెళ్లలేక ., ఇటు వెనక్కి వెళ్లిపోలేక వరదనీటిలో నానాయాతన అనుభవించారు.