అల్పపీడన ముప్పు.. ఉత్తరాంధ్రాకు భారీ వర్ష సూచన.!

|

Aug 05, 2020 | 12:18 PM

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

అల్పపీడన ముప్పు.. ఉత్తరాంధ్రాకు భారీ వర్ష సూచన.!
Follow us on

Rain Alert In AP: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలోని ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. అంతేకాకుండా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉండటంతో రాగల 24 గంటల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని హెచ్చరించింది. ఇక తెలంగాణలో కూడా అల్పపీడన ద్రోణీ ప్రభావంతో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..