బీభత్స బీరూట్, అంతటా హృదయ విదారక దృశ్యాలే !

కనీవినీ ఎరుగని పేలుడుతో లెబనాన్ రాజధాని బీరూట్ వణికిపోయింది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే.. వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలుడు ధాటికి ఈ నగరం సర్వ నాశనమైంది.

బీభత్స బీరూట్, అంతటా హృదయ విదారక దృశ్యాలే !

కనీవినీ ఎరుగని పేలుడుతో లెబనాన్ రాజధాని బీరూట్ వణికిపోయింది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే.. వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలుడు ధాటికి ఈ నగరం సర్వ నాశనమైంది. ఈ ఘోర ఘటనలో 78 మందికిపైగా మరణించగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భవనాలు, ఇళ్ళు, షాపింగ్ సెంటర్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. బీరూట్ గవర్నర్ మార్వాన్ అబౌద్…తన కళ్ళ ముందే శిధిలమైన కట్టడాలను, క్షతగాత్రులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ఇప్పుడు సర్వ నాశనమైన సిటీ అని వ్యాఖ్యానించారు. పోర్టుకు తాను కేవలం 500 గజాల దూరంలోనే ఉన్నానని, ఇప్పటికీ తన కాళ్ల కింద భూమి కంపించినట్టే ఉందని అన్నారు.

లెబనాన్ యుధ్ధం తరువాత ఇంతటి దారుణాన్ని చూడడం ఇదే మొదటిసారని మార్వాన్ పేర్కొన్నారు. కాగా పెద్దఎత్తున రేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు తీవ్రంగా శ్రమించాయి. దట్టమైన పొగలతో ఆకాశం నిండిపోయింది. ఆసుపత్రులన్నీ గాయపడినవారితో నిండిపోయాయి. ఈ పేలుడులో తమ హస్తం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది.

 

Click on your DTH Provider to Add TV9 Telugu