హాట్ టాపిక్‌గా యురేనియం: తవ్వితే ఏమవుతుంది..?

హాట్ టాపిక్‌గా యురేనియం: తవ్వితే ఏమవుతుంది..?

తెలంగాణ అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం వివాదం ముదురుతోంది. యురేనియం కోసం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని.. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యురేనియంను తవ్వితీసేందుకు 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో 400 చోట్ల డ్రిల్లింగ్‌కు పర్మిషన్‌ ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను యురేనియం కార్పోరేషన్‌ కోరింది. దీనికి కొన్ని కండీషన్లు కూడా పెట్టింది. అయితే ఈ కండిషన్లను పాటించకుండా.. తమ ఇష్టమొచ్చినట్లు యూరేనియం కార్పోరేషన్‌ వ్యవహరిస్తోందనే విమర్శలు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 15, 2019 | 4:44 PM

తెలంగాణ అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం వివాదం ముదురుతోంది. యురేనియం కోసం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని.. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యురేనియంను తవ్వితీసేందుకు 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో 400 చోట్ల డ్రిల్లింగ్‌కు పర్మిషన్‌ ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను యురేనియం కార్పోరేషన్‌ కోరింది. దీనికి కొన్ని కండీషన్లు కూడా పెట్టింది.

అయితే ఈ కండిషన్లను పాటించకుండా.. తమ ఇష్టమొచ్చినట్లు యూరేనియం కార్పోరేషన్‌ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యురేనియం తవ్వకాల వలన పరోక్షంగా 83 చదరపు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల పై ప్రభావం పడుతుంది. కృష్ణానది, నాగార్జున సాగర్‌పైనా దీని ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది.

నల్లమల అటవీ ప్రాంతంలో పలు చోట్ల బోర్లు వేసి యురేనియం నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు ఆందోళన చేస్తున్నారు.

కాగా, యురేనియంతో అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల సునామీలు వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అంతేకాదు విద్యుత్ వాడకంలో ఉపయోగించే.. న్యూక్లియర్ అణువులతో అణుబాంబులు తయారు చేస్తారు. ప్రమాదవశాత్తు అవి బ్లాస్ట్ అయితే మానవాళికే పెద్ద ముప్పు వచ్చి పడుతుంది.

భవిష్యత్తులో సహజ ఇంధన వనరులు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని దానివల్ల అణు విద్యుత్ ఉత్పత్తి తప్పనిసరి అని చాలా దేశాలు వాదిస్తున్నాయి. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచమంతటా అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడతాయని ఆ దేశాలు చెబుతున్నాయి. అణు విద్యుత్ ఉత్పత్తి వల్ల రేడియేషన్ ప్రభావం ప్రజలపై, పర్యావరణంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే… ఏ సమస్యా రాదని ఆ దేశాలు వాదిస్తున్నాయి.

అసలు యురేనియం కోసం మైనింగ్ జరపాలంటే… భూమి పై పొరలను భారీ యంత్రాలతో తవ్వాల్సి ఉంటుంది. మధ్యలో ఎదురయ్యే రాళ్లు, శిలలను పగలగొట్టేందుకు పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ చుట్టుపక్కల భూమి అంతా పగుళ్లు వారుతుంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో రేడియేషన్ విడుదలవుతుంది. ఇది గాలిలో కలిస్తే విషపూరితమై పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల భూగర్భ జలాలకు కూడా నష్టం వాటిల్లుతుంది.

1944-1986 సంవత్సరాల మధ్య అమెరికా… దాదాపు 40 లక్షల టన్నుల యురేనియంను సేకరించింది. ఇందుకు సంబంధించిన 500 గనులను పూడ్చి వెయ్యకుండా వదిలేసింది. ఫలితంగా ఆ చుట్టుపక్కల చాలా మంది ప్రజలకు లంగ్ కాన్సర్ వ్యాధి సోకింది. కాగా, నాగర్​కర్నూల్​​ జిల్లాలో నల్లమల అడవులు 2,611 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అయితే ఇందులో 9 కి.మీ. పరిధిలోనే ఖనిజాల కోసం తవ్వకాలు జరుపుతామని గతంలో రీసెర్చ్​ చేసిన సంస్థ తెలిపింది. ఈ విలువైన ఖనిజ సంపదతో దేశ ఆర్థిక రంగానికి ఎంతో లాభం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే యురేనియం తవ్వకాలపై 2005, 2008 సంవత్సరాల్లో కూడా వివాదం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోసారి యురేనియం పై పెద్ద చర్చే జరుగుతోంది. ఇక యురేనియం తవ్వకాలు చేపడితే అడవుల్లో ఉండే జంతువులు, సమీప ప్రాంతాల్లో నివశించే గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి ఎన్నో నష్టాలు ఉంటున్నాయి కాబట్టే… యురేనియం తవ్వకాల్ని మేధావులు వ్యతిరేకిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలా ముగింపు చెబుతుందో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu