Heart Attack: తరచూ కాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? ఐతే జాగ్రత్త.. ఇది కూడా ఒక సంకేతమే..

|

Jul 27, 2022 | 8:39 PM

ఒకప్పుడు 60 యేళ్లు పైబడినవారికి మాత్రమే గుండె జబ్బలు వచ్చేవి. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధంలేకుండా అందరికీ హార్ట్‌ అటాక్‌ సంభవిస్తుంది. ఐతే దీనిని కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే..

Heart Attack: తరచూ కాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? ఐతే జాగ్రత్త.. ఇది కూడా ఒక సంకేతమే..
Heart Attack
Follow us on

signs of heart attack in telugu: ఒకప్పుడు 60 యేళ్లు పైబడినవారికి మాత్రమే గుండె జబ్బలు వచ్చేవి. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధంలేకుండా అందరికీ హార్ట్‌ అటాక్‌ సంభవిస్తుంది. ఐతే దీనిని కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ కాళ్ల నొప్పితో బాధపడేవారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. రక్తం శరీరం అంతటా ప్రసరించినా.. కాళ్లు, పాదాల నుంచి మాత్రమే గుండెకు చేరుతుంది. కాబట్టి ఆ జోన్‌లో సమస్య ఏర్పడినప్పుడు మీ శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి హార్ట్ ప్రాబ్లెంను త్వరగా ఆహ్వానిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాళ్లలో వాపు లేదా సుదీర్ఘకాలం నొప్పి ఉంటే గుండెలో ఏదో సమస్య ఉందని అర్థం.

40 ఏళ్లు పైబడిన 6.5 మిలియన్లకు పైగా అమెరికన్లలో ఈ విధమైన లక్షణాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితోపాటు మధుమేహం, పొగతాగడం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి ఇతర వ్యాధులు కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాళ్ల నొప్పి తీవ్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాళ్లనొప్పి చాలా కాలంగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనితోపాటు కండరాల తిమ్మిరి, కాళ్ళపై పూత, పాదాలు చల్లబడటం వంటి లక్షణాలు కనిపించినా అనుమానించవల్సిందే.

ఇవి కూడా చదవండి

హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు
భుజం/చేయి నొప్పి, కళ్లు తిరగడం, వికారం, అలసట, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలు కన్పిస్తాయి.