కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన బాలీవుడ్ నటి మలైకా అరోరా..హోం క్వారంటైన్ లో గడుపుతోంది. ఈ సందర్బంగా తన కుమారుడు అర్హాన్ ని, తమ పెంపుడు కుక్క ‘క్యాస్పర్’ ని హగ్ చేసుకోలేకపోతున్నానంటూ ఆవేదనతో ఆమె పోస్టును పెట్టింది. తమ ఇంటి బాల్కనీకి మరో వైపు ఉన్న భాగం నుంచి తనను చూస్తున్న అర్హాన్ , క్యాస్పర్ ఫోటోను షేర్ చేసింది ఆమె. ఈ ‘స్వీట్ ఫేసెస్’ తనకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయని, కానీ..మరికొన్ని రోజులపాటు వారిని ఆర్ద్రంగా హత్తుకోలేకపోతున్నానని మలైకా పేర్కొంది. . ఏమైనా ఈ అందమైన ముఖాలే నాకు శక్తినిస్తాయని ఆమె వెల్లడించింది. తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తుంటానని ఆమె ప్రకటించింది.