అలా చేస్తే కరోనాకు చెక్ పెట్టినట్లే.. ఆరోగ్య నిపుణుల సూచన!

| Edited By: Pardhasaradhi Peri

Jun 09, 2020 | 3:53 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే ఫేస్‌షీల్డ్‌ మాస్కులు అత్యంత ఉత్తమమని తాజాగా నిరూపితమైంది. ఇండియన్‌ హెల్త్‌ లైన్‌ జాతీయ

అలా చేస్తే కరోనాకు చెక్ పెట్టినట్లే.. ఆరోగ్య నిపుణుల సూచన!
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే ఫేస్‌షీల్డ్‌ మాస్కులు అత్యంత ఉత్తమమని తాజాగా నిరూపితమైంది. ఇండియన్‌ హెల్త్‌ లైన్‌ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడైన డాక్టర్‌ ప్రవీన్‌ తొగాడియా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి మనకు 1 మీటర్‌ దూరమున్నప్పుడు దగ్గినా, తుమ్మినా వైరస్‌ గాలి ద్వారా మన ముక్కు, నోటినుంచి గొంతులోకి వెళ్తుందని తొగాడియా పేర్కొన్నారు. ఒకవేళ మనం ఫేస్‌షీల్డ్‌ మాస్క్‌ గనుక వాడితే కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు.

కరీనా కట్టడికోసం ఎవరైతే ఫేస్‌షీల్డ్‌ వాడి, ముఖాన్ని పదేపదే తాకకుండా ఉంటారో వారు ఏ మార్గం నుంచి కూడా కరోనా వైరస్‌ లోనికి ప్రవేశించకుండా తమకు తాము రక్షించుకోగలుగుతారని తొగాడియా వెల్లడించారు. సాధారణ మాస్కు కంటే ఫేస్‌ షీల్డ్‌ మాస్కులే ఉత్తమమని అమెరికాలోని ప్రఖ్యాత వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఫేస్‌షీల్డ్‌ను ప్రతిరోజూ స్టెరిలైజ్‌ చేస్తూ అది పగిలిపోయే వరకు వాడుకోవచ్చని సూచిస్తున్నారు. వీటితో గాలి ద్వారా వైరస్‌ మనలోకి ప్రవేశించకుండా పకడ్బందీగా రక్షించుకోగలుగుతామని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ